Nellore: పన్నుల చెల్లింపుపై రాయితీలు.. నెల్లూరు కమిషనర్ కీలక ప్రకటన
Nellore: నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వై.ఓ. నందన్ మూలాపేట ప్రాంతంలో తాగునీటి సరఫరా పనులను తనిఖీ చేశారు.
Nellore: పన్నుల చెల్లింపుపై రాయితీలు.. నెల్లూరు కమిషనర్ కీలక ప్రకటన
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ మెగా ఇంజనీరింగ్ వర్క్స్ తాగునీటి సరఫరా వ్యవస్థ పరిశీలనలో భాగంగా స్థానిక 40వ డివిజన్ మూలాపేట కొండదిబ్బ, కోనేటి మిట్ట తదితర ప్రాంతంలో అధికారులతో కలిసి శనివారం పర్యటించారు.
ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో జరుగుతున్న ఇంజనీరింగ్ సివిల్ వర్క్స్ పనుల నాణ్యతను కమిషనర్ తనిఖీ చేశారు. డివిజన్ పరిధిలోని సురక్షిత తాగునీటి సరఫరా నిర్వహణ తీరును కమిషనర్ పర్యవేక్షించారు. తాగునీటి సరఫరాపై స్థానిక ప్రజలతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి నాణ్యతను స్థానిక ప్రజల సమక్షంలోనే కమిషనర్ పరీక్షలు జరిపి ఫలితాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించే భవనాలకు సంబంధించి పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు మేరకు మాత్రమే నిర్మాణాలను చేపట్టే విధంగా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా డివిజన్ పరిధిలోని అన్ని రోడ్లను ఎండ్ టు ఎండ్ పరిశుభ్రంగా ఉంచేలా ప్రతిరోజు చర్యలు తీసుకోవాలని డ్రైను కాలువల పూడికతీత, సిల్ట్ వ్యర్ధాల ఎత్తివేత పనులను క్రమం తప్పకుండా చేపట్టేలా శానిటేషన్ విభాగం అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
ప్రతి ఒక్క భవనాన్ని అసెస్మెంట్ పరిధిలోకి తీసుకువచ్చి డిమాండ్ విధించాలని, ప్రతి ఒక్క ఆస్తికి సంబంధించిన పన్నులను బకాయిలు లేకుండా పూర్తిస్థాయిలో వసూలు చేయాలని కమిషనర్ సూచించారు. ఈనెల 30 వ తేదీ వరకు వడ్డీ పై 50% రాయితీ, ముందస్తు పన్ను చెల్లింపు పై 5 శాతం రిబేటు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.




