Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వారాంతపు సమీక్ష

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ రెవెన్యూ సిబ్బందితో సమీక్ష. 2026-27 లక్ష్యాలను సాధించాలని, పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం.

V. Narasimhulu, Nellore
Published on: 18 Aug 2026 11:15 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వారాంతపు సమీక్ష

నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ వారాంతపు సమీక్షా సమావేశంలో భాగంగా మంగళవారం రెవెన్యూ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇందులో భాగంగా కమీషనర్ మాట్లాడుతూ...

2026-27 మొదటి అర్థ సంవత్సరం ముగింపు నాటికి నిర్దేశించిన లక్ష్యాలను ప్రతి ఒక్కరూ అందుకోవాలని సూచించారు.కార్యదర్శులు అందరూ ప్రతిరోజూ సచివాలయ పరిధిలో క్రొత్తగా నిర్మించిన నూతన భవనములు, ఖాళీ స్థలములు పన్నులు, అదనపు అంతస్తులు నిర్మించిన భవనాలను కమర్షియల్ భవనములు, నిర్మించిన భవనాలను గుర్తించి వాటిని ఖచ్చితంగా ఆస్తి పన్ను పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు.

రెవిన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వారికి సంబంధించిన అడ్మిన్ కార్యదర్శులు ప్రతిరోజు ఉదయం సచివాలయ పరిధిలో పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పన్నులు బకాయిలు ఉండి లోక్ అదాలత్ ద్వారా నోటీసులు అందుకొని ఇప్పటికీ బకాయిలు చెల్లించని వారిపై తదుపరి చర్యలు తీసుకొన వలసిందిగా రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, రెవిన్యూ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు.

సిబ్బంది అందరూ వారి వారి లాగిన్లలో ఉన్నటువంటి వివిధ పౌర సేవలకు సంబంధించిన సేవలను నిర్దేశించిన సమయము లోపల పరిశీలించి తదుపరి అనుమతుల కొరకు అధికారులకు పంపవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ టి.పి.ఆర్.ఓ. వాసు బాబు, రెవిన్యూ ఆఫీసర్లు సమద్, శ్రీనివాసులు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, సచివాలయ పరిపాలనా కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story