Nellore: నెల్లూరులో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ సదస్సు

Nellore: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతున్న SIR కార్యక్రమంపై ఈ.ఆర్.ఓ, మున్సిపల్ కమిషనర్ వై.ఓ. నందన్ బూత్ లెవెల్ ఏజెంట్లతో (BLA) సమీక్ష నిర్వహించారు.

V. Narasimhulu, Nellore
Published on: 23 Jun 2026 9:00 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ సదస్సు

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న, "స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్" కార్యక్రమ నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు,117 నెల్లూరు సిటీ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు, స్థానిక కస్తూర్బా కళాక్షేత్రం లో మంగళవారం ఈ.ఆర్.ఓ/ కమిషనర్ వై.ఓ నందన్ సమీక్షను నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో పాటించి, ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా రూపకల్పనకు, ప్రతి ఒక్కరు సహకరించాలని, ఈ సందర్భంగా సూచించారు. అన్ని రాజకీయ పార్టీల బి.ఎల్.ఏ లు తమ పరిధిలో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకొని, అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో స్థానం కల్పించి, ప్రభుత్వం నిర్దేశించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story