Nellore: ప్రజా సమస్యలే లక్ష్యం.. నెల్లూరు కమిషనర్ ఆకస్మిక తనిఖీ

Nellore: నెల్లూరు నగర కమిషనర్ వై.ఓ. నందన్ మంగళవారం 22వ డివిజన్ బి.వి. నగర్ మరియు కే.ఎన్.ఆర్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంతాల్లో పర్యటించారు.

V. Narasimhulu, Nellore
Published on: 21 April 2026 3:30 PM IST
Nellore
X

Nellore: ప్రజా సమస్యలే లక్ష్యం.. నెల్లూరు కమిషనర్ ఆకస్మిక తనిఖీ

Nellore: సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాలు అందుకోవడమే కాదు.. అందులో ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి, పరిష్కరించడానికి రంగంలోకి దిగారు నగర కమిషనర్ వై.ఓ.నందన్.

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదుకు క్షేత్రస్థాయిలో పరిష్కారం అందించే దిశగా స్థానిక 22 వ డివిజన్ బి.వి నగర్ సంఘమిత్ర పాఠశాల సమీప ప్రాంతంలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు.

అనంతరం స్థానిక కే.ఎన్.ఆర్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంతం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న భవనానికి సంబంధించి నిర్మాణానికి అనుమతులను కమిషనర్ పరిశీలించి, పట్టణ ప్రణాళికా విభాగం అనుమతుల మేరకు మాత్రమే నిర్మాణాలు జరిపేలా పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story