Nellore: నెల్లూరులో కమిషనర్ వై.ఓ.నందన్ ఆకస్మిక తనిఖీ
Nellore: నెల్లూరు నగర కమిషనర్ వై.ఓ.నందన్ భగత్ సింగ్ కాలనీ మరియు టిడ్కో గృహాల ప్రాంగణంలో పర్యటించారు.
Nellore: నెల్లూరులో కమిషనర్ వై.ఓ.నందన్ ఆకస్మిక తనిఖీ
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 54 డివిజన్ భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ఈ ఆటోస్ ఛార్జింగ్ పాయింట్ ప్రాంతాన్ని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.
అనంతరం స్థానిక టిడ్కో గృహాల ప్రాంగణంలో ఇంజనీరింగ్ సివిల్ వర్క్స్, సిసి రోడ్లు, డ్రైను కాలువల నిర్మాణం, విద్యుత్ విధి దీపాలు, మొక్కల పెంపకం తదితర మౌలిక వసతులను కమిషనర్ పరిశీలించి అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు.
పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లోనూ, సీసీ రోడ్లు, బ్రెయిన్ కాలువల నిర్మాణంలోనూ అలసత్వం వహిస్తే సహించేది లేదంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. మౌలిక వసతుల రూపకల్పనలను అధికారులు ముందంజలో ఉండాలని సూచించారు.
ఎక్కడ కూడా అలసత్వానికి అవినీతికి తావు లేకుండా అధికారులు తమ బాధ్యతలు నిర్వర్తించాలని, ఈ క్రమంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులు లేనని సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, డి.ఈ రఘురాం, వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.




