Nellore: నెల్లూరులో జనసేన ఘనవిజయం.. కార్పొరేటర్‌గా విజయలక్ష్మి!

Nellore: నెల్లూరు కార్పొరేషన్ 21వ డివిజన్‌లో కూటమి జనసేన అభ్యర్థి గునుకుల విజయలక్ష్మి ఘనవిజయం సాధించారు. గుర్రాలమడుగు సంఘం నుంచి భారీ విజయ కేతనం ర్యాలీ నిర్వహించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 5 Nov 2026 6:25 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో జనసేన ఘనవిజయం.. కార్పొరేటర్‌గా విజయలక్ష్మి!

నెల్లూరు: నెల్లూరు నగరంలోని 21వ డివిజన్‌లో కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించిన గునుకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక గుర్రాలమడుగు సంఘం నుంచి విజయ కేతనం ర్యాలీ ఘనంగా నిర్వహించారు.

తనను ఆదరించి, ఆశీర్వదించి, ఓట్లు వేసి కార్పొరేటర్‌గా గెలిపించిన 21వ డివిజన్ ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలియజేస్తూ విజయలక్ష్మి ర్యాలీ ద్వారా ప్రజలను నేరుగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఓటరుకు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కూటమి శ్రేణులకు విజయలక్ష్మి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ ర్యాలీలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ చైర్‌పర్సన్, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ సతీమణి అనురాధ, జనసేన నాయకులు కిషోర్ గునుకులతో పాటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో కార్పొరేటర్‌గా అవకాశం కల్పించిన ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, డివిజన్ అభివృద్ధికి కూటమి నాయకుల సహకారంతో కట్టుబడి ఉంటానని తెలిపారు. ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన కూటమి నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE