Nellore: నెల్లూరు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం 150 తీర్మానాలకు ఆమోదం!

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో 150 అజెండా తీర్మానాలకు ఆమోదం. మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వై.ఓ. నందన్, డిప్యూటీ మేయర్ తహసీన్ హాజరు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 13 Aug 2026 5:11 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం 150 తీర్మానాలకు ఆమోదం!

Nellore: నగర పాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు.

మేయర్ దేవరకొండ సుజాత అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ప్రవేశపెట్టిన 150 తీర్మానాలను అజెండాగా ప్రకటించగా, అన్ని తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ...

అజెండాలోని అన్ని అంశాలు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య భద్రత, నగరాభివృద్ధి ధ్యేయంగా రూపొందించబడినవని, అన్ని డివిజన్లకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను అజెండాలో పొందుపరిచామని తెలిపారు.

మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పి. నారాయణ, రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సారధ్యంలో, అన్ని డివిజన్ల కార్పొరేటర్ల సహకారంతో, నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల పర్యవేక్షణలో నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని మేయర్ పేర్కొన్నారు.

కార్పొరేషన్ కమిషనర్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో పాటు నగర ప్రజలందరి సహకారంతో నెల్లూరు నగర పాలక సంస్థ ఉన్నతి సాధించేలా సమన్వయంగా కృషి చేస్తామని మేయర్ ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్, కో ఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు, కమిషనర్ వై.ఓ. నందన్, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story