Nellore: నెల్లూరు 22వ డివిజన్లో వైఎస్సార్సీపీ ప్రచార హోరు!
Nellore: నెల్లూరు 22వ డివిజన్ వేపదరువు సెంటర్లో వైఎస్సార్సీపీ భారీ రోడ్ షో. మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డిలకు మద్దతుగా ప్రచారం.
Nellore: నెల్లూరు 22వ డివిజన్లో వైఎస్సార్సీపీ ప్రచార హోరు!
నెల్లూరు: నెల్లూరు 22వ డివిజన్ లో వేపదరువు సెంటర్ లో.. జరిగిన వైసిపి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి.. వైఎస్ఆర్ సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.. వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డితో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్బంగా జరిగిన రోడ్ షో.. కార్యక్రమంలో.. మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి, 22వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి వేనాటి శ్రీకాంత్ రెడ్డి , ఓటర్లను అభ్యర్థిస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ప్రజలు ఓటు వేయాలని కోరారు. మంచి మనసున్న వ్యక్తులైన ఆనం విజయకుమార్ రెడ్డిని, వేనాటి శ్రీకాంత్ రెడ్డిని ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కోరారు.




