Nellore: కూటమి అభ్యర్థులకు అండగా నిలవండి: ఎంపీ వేమిరెడ్డి పిలుపు!

Nellore: నెల్లూరు నగరంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. మేయర్ అభ్యర్థి రూప్‌ కుమార్‌ యాదవ్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 26 Oct 2026 12:57 AM IST
Nellore
X

Nellore: కూటమి అభ్యర్థులకు అండగా నిలవండి: ఎంపీ వేమిరెడ్డి పిలుపు!

నెల్లూరు: నెల్లూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నెల్లూరులో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు.

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం ఎంపీ ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నగర అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

మేయర్‌ అభ్యర్థి పోలుబోయిన రూప్‌ కుమార్‌ యాదవ్‌ తో పాటు 56, 61, 62, 63, 64, 65 డివిజన్ల కార్పొరేటర్‌ అభ్యర్థులు నందిమండలం వెంకట శ్రీదివ్య, శ్రీ ఆనం రంగమయూర్‌ రెడ్డి , శ్రీ పోట్లూరు రామకృష్ణ , మొహమ్మద్‌ జుబేరుద్దీన్‌ , షేక్‌ నజీమా, ధర్మవరపు గణేశ్‌ కుమార్‌లను ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE