Nellore: నెల్లూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక – 50 అర్జీలు స్వీకరణ!
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మేయర్ సుజాత అశోక్, కమిషనర్ వై.ఓ నందన్ హాజరు. 50 అర్జీల స్వీకరణ, కీలక ఆదేశాలు.
Nellore: నెల్లూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక – 50 అర్జీలు స్వీకరణ!
Nellore: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వై.ఓ నందన్ లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ....
ప్రజలనుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన విభాగాల అధికారుల ద్వారా శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పి.నారాయణ ఆలోచనలతో సి.ఎస్.ఆర్ నిధుల సహకారంతో నగవ్యాప్తంగా పచ్చదనం కోసం హరిత నెల్లూరు సాకారంలో భాగంగా ఏర్పాటు చేసిన మొక్కలను లేదా వాటిని సంరక్షించే ట్రీ గార్డులను ధ్వంసం చేయడం లేదా దొంగలించడం వంటి చర్యలను నగరపాలక సంస్థ తీవ్రంగా పరిగణిస్తుందని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ హెచ్చరించారు.
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో భాగంగా ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించే వాహనాలకు తడి పొడి వ్యర్ధాలను విడివిడిగా అందించాలని, రీసైక్లింగ్ విధానానికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కమిషనర్ వై.ఓ నందన్ మాట్లాడుతూ...
టిడ్కో గృహాలలో గృహాలు మంజూరు అయినప్పటికీ స్వాధీనం పొందక ఉన్న వాటిని అర్హులైన ఇతర లబ్ధిదారులకు 602 మందికి కేటాయిస్తున్నామని, అర్హులైనవారు టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 365, 430 చ.అ డబుల్ బెడ్ రూమ్ గృహాలకోసం ఆసక్తికలవారు లోన్ అర్హతను బ్యాంకర్ల ద్వారా చెక్ చేసుకోవాలని, లేదంటే పూర్తి మొత్తాన్ని ఒకేసారి చెల్లించి కూడా గృహాలను స్వంతం చేసుకోగలరని కమిషనర్ సూచించారు.
భవన నిర్మాణ సామాగ్రిని అవసరం కన్నా ఎక్కువగా డంపు చేసుకుని, నిర్మాణాల అనంతరం వాటిని రోడ్లపై అలాగే వదిలేయడం వల్ల డ్రైన్ కాలువలలో పడి పూడికతీతకు ప్రధాన అడ్డంకిగా మారుతుందని కమిషనర్ తెలిపారు. కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషింగ్ వేస్ట్ ను తప్పనిసరిగా నగరపాలక సంస్థ ద్వారానే తిరిగి వినియోగించాలని సూచించారు.
కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 94940 18118 కు సమాచారం అందిస్తే నిర్మాణ వ్యర్ధాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బోడిగాడి తోట ప్రాంతంలో ఏర్పాటుచేసిన కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషింగ్ వేస్ట్ ప్లాంట్ ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. నగరవ్యాప్తంగా సేకరించే భవన నిర్మాణ వ్యర్ధాలను లోతట్టు ప్రాంతాలలో వేసి ఆ ప్రాంతాలలో వరద ముంపు ప్రభావం లేకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ప్రకటించారు.
నగర వ్యాప్తంగా కేబుల్ వ్యవస్థ ద్వారా సేవలు అందిస్తున్న కేబుల్ సంస్థల నిర్వాహకులు వినియోగంలో లేని తమకు సంబంధించిన తీగలను స్థంబాల నుంచి 3 రోజుల్లోపు తొలగించాలని, ప్రజలకు సమస్యాత్మకంగా ఉన్న తీగలను గుర్తించి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అన్నిటినీ తొలగించేస్తామని కమిషనర్ హెచ్చరించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభాగాల వారీగా టిడ్కో హౌసింగ్ 28, టౌన్ ప్లానింగ్ 06, రెవెన్యూ 01, ఇంజనీరింగ్ 09, అకౌంట్ సెక్షన్ 01, పబ్లిక్ హెల్త్ 01, ఆప్కాస్ 02, పెన్షన్ 02 మొత్తం 50 వినతులను మేయర్, కమిషనర్ లు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, ఈ.ఈ లు శేషగిరిరావు, అనిల్ కుమార్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథరావు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




