Nellore: టీడీపీ హయాంలోనే నెల్లూరు అభివృద్ధి: సింధూర పొంగూరు!
Nellore: టీడీపీ పాలనలోనే నెల్లూరు నగరం సమగ్ర అభివృద్ధి సాధించిందని మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర భగత్ సింగ్ కాలనీలో ప్రచారం చేస్తూ పేర్కొన్నారు.
Nellore: టీడీపీ హయాంలోనే నెల్లూరు అభివృద్ధి: సింధూర పొంగూరు!
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ హయాంలోనే నెల్లూరు నగరం ఎంతగానో అభివృద్ధి చెందిందని, కేవలం రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో మంత్రిగా నారాయణ 6 వేల కోట్ల నిధులను తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారని, భగత్ సింగ్ కాలనీ నిర్వాసితులకు శాశ్వత పట్టాలు అందజేసిన ఘనత నారాయణకు దక్కుతుందని మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర పొంగూరు పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం 71,72వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో, వెంకటేశ్వరపురం సెంటర్ తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులకు టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
మంత్రి నారాయణ నేతృత్వంలో భగత్ సింగ్ కాలనీ నిర్వాసితులకు శాశ్వత పట్టాలు అందజేయడమే కాకుండా ఈ ప్రాంతంలో మూడు కోట్ల నిధులతో షాది మంజిల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు 40 కోట్ల నిధులను వెచ్చించి నిర్మాణ పనులను చేపట్టారన్నారు.
గతంలో కంటే మిన్నగా రాబోయే రెండు ఏళ్లలో నెల్లూరు నగరాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి నారాయణ అడుగులేస్తున్నారని అందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అందుకు 72వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సల్మా జహీర్ ను 71 వ డివిజన్ అభ్యర్థి షేక్ అలియా ను అలాగే మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ ను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు నాయకులు పాల్గొన్నారు.




