Nellore: గాజు గ్లాసు, సైకిల్ గుర్తులకు ఓటేయండి: కూటమి నేతల పిలుపు!

Nellore: నెల్లూరు కార్పొరేషన్ 21వ డివిజన్‌లో జనసేన కార్పొరేటర్ అభ్యర్థి గునుకుల విజయలక్ష్మి, మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ విజయమే లక్ష్యంగా కూటమి విస్తృత ప్రచారం చేపట్టింది.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 23 Oct 2026 11:52 PM IST
Nellore
X

Nellore: గాజు గ్లాసు, సైకిల్ గుర్తులకు ఓటేయండి: కూటమి నేతల పిలుపు!

నెల్లూరు: 21వ డివిజన్‌ నుంచి జనసేన పార్టీ తరఫున కూటమి బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి గునుకుల విజయలక్ష్మికి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి, నెల్లూరు నగర మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ కి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని నాయకులు ప్రతి గడపకు వెళ్లి ప్రజలను అభ్యర్థించారు.

నెల్లూరు నగర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు అఖండ మెజారిటీ అందించాలని జనసేన నాయకుల విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలనే లక్ష్యంతో 21వ డివిజన్‌లో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మాజీ చైర్‌పర్సన్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు తాళ్లపాక అనురాధమ్మ , మాజీ జడ్పీటీసీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు విజేత, సీనియర్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ముంగమూరి యశ్వంత్ ,21వ డివిజన్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సాయి, జనసేన పార్టీ నాయకులు శ్రీ కిషోర్ తదితరుల ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE