Nellore: అభివృద్ధి కళ్లముందే కనిపిస్తోంది.. 21వ డివిజన్‌లో జనసేన గడప గడప ప్రచారం

Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యమని జనసేన నేతలు కిషోర్ గునుకుల, వీరమహిళ విజయలక్ష్మి తెలిపారు.

A Praveen, Nellore
Published on: 8 Oct 2026 10:40 PM IST
Nellore
X

Nellore: అభివృద్ధి కళ్లముందే కనిపిస్తోంది.. 21వ డివిజన్‌లో జనసేన గడప గడప ప్రచారం

నెల్లూరు: రాష్ట్ర శ్రేయస్సు కు,ప్రజల జీవితాలలో మార్పుకు, రాజకీయ జవాబు దారీ తనం,పారదర్శక పాలన కొరకు పవన్ కళ్యాణ్ గారి వ్యూహం తో బలమైన కూటమి సమన్వయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే–మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో, నెల్లూరు నగరంలో అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళ విజయలక్ష్మి గునుకుల అన్నారు.

గత నెల రోజులుగా నెల్లూరు నగరం 21వ (పాత 16వ) డివిజన్‌లో ప్రతి గడపను చేరుకుంటూ ప్రజల ఆశీస్సులు, మద్దతు కోరుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో వచ్చిన మార్పు, అభివృద్ధి ప్రజలకు కళ్లముందే కనిపిస్తోందన్నారు.

పవన్ కళ్యాణ్ గారి సమన్వయ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో కూడిన పాలన, పొంగూరు నారాయణ గారి ప్రజలతో మమేకమై పనిచేసే విధానం కూటమి అభివృద్ధికి బలమైన శక్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం నుంచి నెల్లూరు నగర అభివృద్ధి వరకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని అన్నారు.

రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి ప్రయాణంలో ప్రతి కుటుంబం భాగస్వామి కావాలని వారు ప్రజలను కోరారు. ప్రతి గడప వద్ద లభిస్తున్న సానుకూల స్పందన కూటమి విజయానికి స్పష్టమైన సంకేతమని అన్నారు.

ఈ సందర్భంగా ఆదిత్యనగర్, లక్ష్మీనగర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతాల్లో పలు కుటుంబాలను కలిసి కూటమి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళ విజయలక్ష్మి గునుకులతో పాటు ప్రవల్లిక, విజయ, సుప్రియ, కృష్ణవేణి, శ్రీలక్ష్మి, కల్పన, నరహరి, నాగేంద్రబాలు, కృష్ణమోహన్ రెడ్డి, మల్లిరెడ్డి, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore