Nellore: ముస్లిం, మైనార్టీ వార్డుల్లో వైసిపికి ఆదరణ: ఆనం విజయ్!
Nellore: నెల్లూరు కోటమిట్టలోని మైనార్టీ ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ప్రచారం నిర్వహించగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
Nellore: ముస్లిం, మైనార్టీ వార్డుల్లో వైసిపికి ఆదరణ: ఆనం విజయ్!
నెల్లూరు: నెల్లూరు కోటమిట్టలోని సిటిజన్ స్కూల్ రోడ్డు, హజీరా హాస్పిటల్ వీధిలో.. వైస్సార్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, . వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి ,63వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి షేక్ తహసీన్ తో కలిసి.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో జరిగినరోడ్ షోలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కి, ఆనం విజయకుమార్ రెడ్డి కి, తహసీన్ కి..మైనారిటీలు బ్రహ్మ రథం పట్టారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వారు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,ఆనం విజయ్ కుమార్ రెడ్డి .నగరంలో వైసీపీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. మైనార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మేలును తెలియజేశారు.




