Nellore: పోలీస్ అమరవీరుల సంస్మరణ: నెల్లూరులో రక్తదానం!
Nellore: నెల్లూరు జిల్లా ముత్తుకూరు ఫిషరీస్ కళాశాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు.
Nellore: పోలీస్ అమరవీరుల సంస్మరణ: నెల్లూరులో రక్తదానం!
నెల్లూరు: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం ఫిషరీస్ కళాశాలలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి కళాశాల ప్రిన్సిపాల్ ధన్పాల్, నెల్లూరు రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు రిర్బన్ కట్ చేసి ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు.
ముత్తుకూరులోని యువకులు కళాశాల విద్యార్థినిలు శిబిరంలో పాల్గొన్నారు. రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు మరియు ముత్తుకూరు సిఐ రఘుబాబు,ఎస్సై వెంకట కొండారెడ్డి కృష్ణపట్నం పోర్ట్ ఎస్సై శ్రీనివాసరెడ్డి తోటపల్లి గూడూరు ఎసై కామినేని గోపి రక్తదానం శిభరంలో పాల్గొన్నారు. రెడ్ క్రాస్ డాక్టర్ దూడలు సుధాకర్ పర్యవేక్షించారు.




