Marripadu: చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో నందవరం ఆదర్శ పాఠశాల ప్రతిభ

Marripadu: మర్రిపాడు మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో నందవరం ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రథమ స్థానం. జిల్లా స్థాయికి ఎంపిక.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 12 Sept 2026 5:48 PM IST
Marripadu
X

Marripadu: చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో నందవరం ఆదర్శ పాఠశాల ప్రతిభ

మర్రిపాడు: మర్రిపాడు మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని నందవరం ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు.

మర్రిపాడు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి పోటీల్లో నందవరం ఆదర్శ పాఠశాలకు చెందిన యశ్వంత్,పార్థు, షహనాజ్‌ లతో కూడిన బృంధం ప్రథమ స్థానాన్ని సాధించి జిల్లాస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలియజేశారు.

జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు,ఇతర సిబ్బంది అభినందనలు తెలియచేశారు. జిల్లా స్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)