Nellore: నెల్లూరులో కార్గిల్ అమరులకు ఎన్సీసీ క్యాడేట్ల నివాళి

Nellore: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు. కొవ్వొత్తులు వెలిగించి అమర జవాన్లకు నివాళులర్పించిన ఎన్సీసీ క్యాడేట్లు.

V. Narasimhulu, Nellore
Published on: 26 July 2026 4:01 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో కార్గిల్ అమరులకు ఎన్సీసీ క్యాడేట్ల నివాళి

నెల్లూరు: నేడు, 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొదంగవే కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ నందు గల ఎన్ సి సి ఫస్ట్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్సీసి క్యాడేట్లు కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గుండాల నరేంద్ర బాబు మాట్లాడుతూ....

1999వ సంవత్సరం మే 10న భారత్ పాకిస్థాన్ ల మధ్య కాశ్మీర్ లోని కార్గిల్ సెక్టార్ వద్ద ప్రారంభమైన కార్గిల్ యుద్ధ నేపథ్యం గురించి వివరిస్తూ... పాకిస్తాన్ సైన్యం దుష్ట పన్నాగంతో భారత్ భూభాగంలోకి చొరబడి, కాశ్మీర్ లడక్ లోని గ్రాస్ కార్గిల్ సెక్టార్ వద్ద గల పాయింట్ 4875 మరియు పాయింట్ 5140 లను ఆక్రమించగా భారత్ సైన్యo "ఆపరేషన్ విజయ్" ప్రారంభించి దాదాపు మూడు నెలలు వీరోచితంగా పోరాడి, పాక్ ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి సాధించి, పాక్ పై ఘన విజయం సాధించిందని...

దానికి చిహ్నంగా ప్రతి సంవత్సరం జూలై 26వ తారీఖున "కార్గిల్ విజయ్ దివస్ ను" లడక్ లోని గ్రాస్ కార్గిల్ వార్ మెమోరియల్ నందు పాక్ సైన్యంపై వీరోచితంగా పోరాడి అమరులైన భారత జవాన్ల త్యాగనిరతిని, ధైర్య సాహసాలను స్మరిస్తూ... వారి స్మారకార్థం నూనె దీపాలను వెలిగించి వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుందని..

ఈ యుద్ధంలో భారత సైనికులు దాదాపు 527 మంది అమరులైనారని ఈ యుద్ధంలో ప్రధానంగా కెప్టెన్ విక్రం పాత్ర, లెఫ్ట్నెంట్ మనోజ్ కుమార్ పాండే, మేజర్ రాజేష్ సింగ్ అధికారి,మేజర్ వివేక్ గుప్తా, రైఫిల్మ్యాన్ సంజయ్ కుమార్, గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ తదితర సైనికులు మన దేశానికి చేసిన సేవ ఎంతో విశిష్టమైనదని, వారి ధైర్య సాహసాలను, శౌర్య పరాక్రమాలను, త్యాగనిరతిని, నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని దేశం కోసం అమరులైన సైనికులకు నివాళులర్పించడం...

ప్రతి భారతీయుని కర్తవ్యమని, కార్గిల్ యుద్ధం, 14 జూలై 1999న ముగిసిందని, అధికారికంగా జులై 26న భారత ప్రభుత్వం పాకిస్తాన్ సైనికులను కార్గిల్ సెక్టార్ నుంచి పూర్తిగా తుద ముట్టించిన నేపథ్యంలో...‌ కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటామని బాల్యం నుంచే ప్రతి ఒక్కరూ దేశం కోసం దేనికైనా సిద్ధపడాలని ప్రతి ఒక్కరూ నిత్యం దేశం కోసం సన్నద్ధంగా ఉండాలని నిరంతరం ప్రతి భారతీయుడు అప్రమత్తతతో వ్యవహరించాలని, దేశభక్తి సేవా నిరతి పోరాట పటిమ ధైర్య సాహసాలు కలిగి ఉండాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి సి. మంజులవాణి ఉపాధ్యాయులు, ఎన్సిసి క్యాడేట్లు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story