Nellore: ఆదివారం నీట్-పీజీ ప్రవేశ పరీక్ష - పటిష్ట పోలీసు బందోబస్తు

Nellore: నెల్లూరు జిల్లాలో ఆదివారం జరిగే నీట్-పీజీ పరీక్ష కోసం 4 కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు.

V. Narasimhulu, Nellore
Published on: 29 Aug 2026 11:39 PM IST
Nellore
X

Nellore: ఆదివారం నీట్-పీజీ ప్రవేశ పరీక్ష - పటిష్ట పోలీసు బందోబస్తు

నెల్లూరు: ఈ నెల 30వ తేదీ, ఆదివారం, వివిధ ఎం.డి./ఎం.ఎస్. మరియు పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్–పీజీ (NEET-PG) ప్రవేశ పరీక్ష SPSR నెల్లూరు జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడనున్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఆదేశాల మేరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

పరీక్ష ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడుతుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 8.30 గంటల తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి ఎవరినీ అనుమతించరు.

జిల్లాలో మొత్తం 4 పరీక్షా కేంద్రాల్లో 950 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షల సజావు నిర్వహణ కోసం ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, నిరంతర నిఘా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, పరీక్షా కేంద్రాల చుట్టూ 200–300 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 BNSS నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. ఆ పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని సూచించారు.

అదేవిధంగా, పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా నిషేధం అని స్పష్టం చేశారు.

పరీక్ష పేపర్ లీక్‌కు సంబంధించి తప్పుడు వార్తలు, వదంతులు సోషల్ మీడియాలో ప్రచారం చేసినా, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినా లేదా పరీక్షల నిర్వహణకు ఆటంకం కలిగించినా సంబంధిత వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఆదేశాల మేరకు హెచ్చరించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story