Nellore: మంత్రి నారాయణకు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సత్కారం

Nellore: నెల్లూరు నగరపాలక ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించిన సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణను మర్యాదపూర్వకంగా సత్కరించిన నుడా చైర్మన్ కోటంరెడ్డి.

V. Narasimhulu, Nellore
Published on: 4 Nov 2026 5:44 PM IST
Nellore
X

Nellore: మంత్రి నారాయణకు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సత్కారం

నెల్లూరు: నెల్లూరు నగరంలోని అన్ని వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అఖండ విజయం సాధించిన సందర్భంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి.

ఈ చారిత్రాత్మక విజయం నెల్లూరు ప్రజలు అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అందించిన ఘనమైన తీర్పు. ఈ విజయానికి మంత్రి నారాయణ నాయకత్వం, మార్గదర్శకత్వం ఎంతో కీలకం అని అన్నారు.

నెల్లూరు నగర అభివృద్ధికి ప్రజలు అందించిన ఈ విజయాన్ని మరింత బాధ్యతగా స్వీకరిస్తూ, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore