Nellore: అనుమతులు లేని లేఅవుట్లపై కఠిన చర్యలు – నుడా చైర్మన్
Nellore: నుడా అనుమతులు లేకుండా వేసే లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే డెమోలిష్ చేయాలని చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆదేశించారు.
Nellore: అనుమతులు లేని లేఅవుట్లపై కఠిన చర్యలు – నుడా చైర్మన్
నెల్లూరు: నుడా అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అధికారులను ఆదేశించారు. నుడా కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశమై లేఅవుట్లు, ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు, అనుమతులు లేని లేఅవుట్లపై సమీక్ష నిర్వహించారు.
నుడా పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లపై చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే వాటిని డెమాలిష్ చేయాలని ఆదేశించారు. అక్రమ లేఅవుట్ల విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండకూడదని స్పష్టం చేశారు.
ఎల్ఆర్ఎస్‌పై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని చైర్మన్ సూచించారు. ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వాటిని నిబంధనల మేరకు పరిశీలించి, అర్హత ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నుడా అప్రూవల్ లేని లేఅవుట్లలో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయవద్దని కోటంరెడ్డి సూచించారు.
ప్లాట్ కొనుగోలు చేసే ముందు లేఅవుట్‌కు నుడా అనుమతి ఉందో లేదో నిర్ధారించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనుమతులు లేని లేఅవుట్లను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు చైర్మన్ స్పష్టం చేశారు..




