Nellore: ఉదయగిరి టీడీపీలో కొత్త జోష్ నింపిన 'పల్లె పండుగ 3.0'!

Nellore: ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్, నాయకుల సమన్వయంతో 'పల్లె పండుగ 3.0' కార్యక్రమం విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 1 Oct 2026 11:41 AM IST
Nellore
X

Nellore: ఉదయగిరి టీడీపీలో కొత్త జోష్ నింపిన 'పల్లె పండుగ 3.0'!

Nellore: రెండు గ్రూపులు మూడు వర్గాలు ప్రతి మండలంలోనూ నేతల మధ్య విభేదాలు ఇది మొన్నటి పల్లె పండుగ 3.0. కార్యక్రమం ఉదయగిరి నియోజకవర్గం లోని టిడిపిలో కనిపించిన అనిచ్చితి. తాజాగా అధినేత హాజరైన పల్లె పండుగతో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం టిడిపిలో కొత్త జోష్ నెలకొందా..? అంటే అవుననే అంటున్నారు పార్టీలోని ప్రధాన నేతలు.

పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కతాటిపైకి వచ్చిన నియోజకవర్గం టిడిపి నేతలు కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయడంతో స్థానిక శాసనసభ్యులతో పాటు కేడర్కు అధినేత నుంచి అభినలు వెల్లువెత్తాయి.దీంతో అసమ్మతులు సైతం ఈ కార్యక్రమం తో సమ్మతించాయి.ఫలితగా ఇప్పుడు ఉదయగిరి టిడిపిలో అధినేత కొత్త ఫుల్ జోష్ నింపినట్లయింది.

ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం నిర్వహణలో ఉదయగిరి ఎమ్మెల్యే తో పాటు అనుచర వర్గం ప్రత్యేకించి వెంకట్ రెడ్డి టీం పెట్టిన ఎఫ్2 ఇప్పుడు రాష్ట్రస్థాయిలో చర్చినియాంశంగా మారింది కూటమి సారధ్యంలో కార్యక్రమం నిర్వహించినప్పటికీ టిడిపి జెండాలతో మొత్తం నియోజకవర్గ ంలో పసుపు మయంగా మార్చేశారు ఇదే సమయంలో అశేషంగా వచ్చిన కుటమి నాయకులు టిడిపి క్యాడర్ కి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా సకల సౌకర్యాలు అన్నట్లు ఏర్పాటు చేశారు దీంతో అధినేత నుంచి కూటమినేతల్లోనూ నేతల నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు వర్గానికి అభినందనలు లభించాయి.

ఇది ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గం లోని టీడీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపుతోంది.స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరిగిన ఈ సభ రానున్న కాలంలో మంచి ఫలితాలు ఇస్తుందన్న విశ్లేషణ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. ప్రత్యేకించి మారుమూల పల్లెలో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించడంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో పాటు ప్రధాన అనుచరుడుగా ఉన్న మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి అన్ని తానై వ్యవహరించాడు ఒకవైపు మండుటెండలు సుదూరమైన మెట్ట ప్రాంతం కావడంతో అశేషంగా వచ్చిన జనాలకి భోజన సదుపాయాలు మంచినీరు మజ్జిగ వంటివి అందిస్తూ అలాగే దూరప్రాంతాల నుంచి వచ్చిన శాసనసభ్యులకు వసతులు కల్పిస్తూ అధినేత దృష్టిని ఆకర్షించింది. ఈ సభ జోష్ రానున్న స్థానిక ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో లేచి చూడాలి మరి.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI