Nellore: నెల్లూరులో మొక్కల చిచ్చు.. కమిషనర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు!

Nellore: నెల్లూరు నగరంలో మొక్కల పెంపకం పేరిట జరిగిన అవినీతిపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నగర కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 20 April 2026 2:59 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో మొక్కల చిచ్చు.. కమిషనర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు!

Nellore: గత కొద్ది రోజులుగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మొక్కల పెంపకం, కొనుగోలు వ్యవహారంలో జరిగిన అవినీతిపై వాదోపవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నగర కమిషనర్ వై.ఓ. నందన్ కు వినతి పత్రం సమర్పించారు. నిజా నిజాలు ప్రజలకు తెలియాలని అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు సవాల్ విసురుకోవడం ప్రజలు గమనిస్తున్నారని, అసలు ఈ మొక్కల పెంపకం వ్యవహారంలో జరిగిన వ్యవహారం ఏమిటో మొత్తం ప్రజలకు తెలియజేయాలని కోరారు.

నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో, నెల్లూరు రూరల్ మరియు నెల్లూరు సిటీ నియోజకవర్గాల పరిధిలో ఉండేటటువంటి కార్పొరేషన్ డివిజనల్ లో 2025-26, 2024-25 ఆర్థిక సంవత్సరంలో నగరంలో మొక్కలు నాటడం, మరియు వాటి యొక్క నిర్వహణకు సంబంధించి టెండర్ల వివరాలతో పాటు, ఏ గ్రాంట్స్ నుంచి ఎంత మొత్తం వెచ్చించారు, అందులో సి ఎస్ ఆర్ నిధులు ఎంత వాటి యొక్క వివరాలు, కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులు యొక్క వివరాలు సమాచార హక్కు చట్టం క్రింద తెలుపగలరని విన్నవించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story