Nellore: నెల్లూరులో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్!
Nellore: నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.
Nellore: నెల్లూరులో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్!
Nellore: జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు, నేరచరిత్ర కలిగిన నేరస్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు నెల్లూరు పోలీసు అధికారులు జిల్లాలో నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, హిస్టరీ షీటర్స్, సత్ప్రవర్తనతో మెలిగేలా తగు చర్యలు తీసుకోవాలి అని ఇచ్చిన జిల్లా యస్.పి. ఆదేశాల మేరకు,, నేడు ఆదివారం జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు మరియు నేరచరిత్ర గల నేరస్థులు ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు నెల్లూరు పోలీసులు.
ప్రజా శాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదు. ఎవ్వరిని ఉపేక్షించం.. పద్ధతులు మార్చుకోండి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. అని హెచ్చరికలు చేశారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించి వీటిని అరికట్టే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం ప్రజలకు పలు హెల్ప్ లైన్ లు అందుబాటులో ఉన్నాయని, రౌడీయిజం చేస్తే నిముషాలలోనే పోలీసుల దృష్టికి చేరుతుందని, అందుకు తగ్గట్టుగానే పోలీసుల ప్రతి చర్యలు కూడా అదే స్థాయిలో ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.
రౌడీ, KD, DC కదలికలపై పటిష్ఠ నిఘా. ప్రజా శాంతికి ఏమాత్రం భంగం కలిగిస్తే PD-Act లు ఓపెన్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపకల్పన, మారుమూల ప్రాంతాల సైతం CC కెమెరాలు ఏర్పాటు చేసామని చెప్పారు. బీట్లు పటిష్టంగా అమలు పరుస్తున్నామని తెలిపారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని,
జిల్లాను ప్రశాంత జిల్లాగా ఉంచుతూ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసుల విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. గతంలో నేరాలకు పాల్పడిన ముద్దాయిలపై నిఘా పెంచామని, పోలీసుల మాటలను వినకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రతి నేరస్తుడిపై పటిష్ఠ నిఘా నిరంతరం ఉంటుందని, నేర ప్రవర్తనను మానుకొని ప్రజలతో సహేతుకంగా మెలుగుతూ ఎవరికీ ఎటుంటి ఇబ్బంది కలిగించకుండా జీవించాలని సూచించారు. నేరాలకు పాల్పడి జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని హెచ్చరికలు చేశారు.
జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ప్రస్తుతం వారు జీవిస్తున్న విధానం, జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై ఆరా తీశారు.
మీ ప్రాంతాలలో ఏదైనా అల్లర్లు, గొడవలు జరిగితే వెంటనే సదరు సమాచారాన్ని డయల్ 112 కి గానీ, పోలీసు కంట్రోల్ రూమ్ వాట్సాప్+919392903413 కు, దగ్గరలోని పోలీస్ పోలీస్ స్టేషన్ వారి దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.




