Nellore: రౌడీ మూకల గుండెల్లో రైళ్లు.. డ్రోన్ నిఘాతో నెల్లూరు

Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు వెంకటాచలం పరిధిలోని చెముడుగుంటలో పోలీసులు విస్తృత కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.

V. Narasimhulu, Nellore
Published on: 22 May 2026 12:33 PM IST
Nellore
X

Nellore: రౌడీ మూకల గుండెల్లో రైళ్లు.. డ్రోన్ నిఘాతో నెల్లూరు

నెల్లూరు: అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించే పనిలోపడ్డారు నెల్లూరు పోలీసులు. విస్తృత తనిఖీల ,నిరంతర నిఘా, కార్డె సెర్చ్, డ్రోన్ నిఘాతో ఆకతాయిల, రౌడీ మూకల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు... ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు వెంకటాచలం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెముడు గుంట ప్రాంతంలో విస్తృత కార్డన్ & సెర్చ్ నిర్వహించారు.

సుమారు 120 ఇళ్లలో తనిఖీలు చేపట్టి, పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు మరియు 3 ఆటోలను స్వాధీనం చేసుకుని పరిశీలనలో ఉంచారు. మత్తు పదార్థాల నియంత్రణ, నేరాల నివారణ & అనుమానాస్పద కదలికలపై సమాచారం కోసం వెంటనే పోలీసులకు లేదా 112కు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story