Nellore: ఎమ్మెల్సీ పర్వతరెడ్డికి పోలీసుల నోటీసులు
Nellore: మంత్రి నారాయణకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఘటనలో వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Nellore: ఎమ్మెల్సీ పర్వతరెడ్డికి పోలీసుల నోటీసులు
Nellore: నెల్లూరు రాంజీ నగర్‌లోని వైఎస్ఆర్‌సీపీ సిటీ కార్యాలయంలో.. వైఎస్ఆర్‌సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కి వన్‌టౌన్ పోలీసులు నోటీసులు అందజేశారు.
ఇటీవల నెల్లూరు వీఆర్సీ సెంటర్‌లో..
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో చెత్త నిర్వహణకు సంబంధించి జరిగిన 1,200 కోట్ల దోపిడీపై మంత్రి నారాయణను ప్రశ్నిస్తూ.. వైఎస్ఆర్‌సీపీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నిరసన కార్యక్రమం నేరమంటూ.. ప్రభుత్వం ప్రతిపక్షం పై కక్ష కట్టిందని,
ప్రజలకోసం పోరాడుతున్న ysrcp నాయకుల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటు అని అన్నారు.
ప్రజా సమస్యలపై గళం విప్పినందుకే ప్రభుత్వం వైస్సార్సీపీ నేతలపై.. అక్రమ కేసులు బనాయించిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
కేసులు పెట్టడం ద్వారా ప్రతిపక్షాన్ని అడ్డుకోవాలని చూస్తే.. మరింత దూకుడుగా పోరాటాన్ని సాగిస్తామని తెలిపారు.
ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై.. కూటమి ప్రభుత్వ అవినీతి చర్యలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.. కేసులకు భయపడకుండా.. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు.




