Nellore: మహిళల రక్షణ కవచం 'శక్తి యాప్' : జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల
Nellore: నెల్లూరు జిల్లాలో మహిళల భద్రత కోసం పోలీసులు 'శక్తి యాప్'పై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
Nellore: మహిళల రక్షణ కవచం 'శక్తి యాప్' : జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల
Nellore: మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ.. మహిళల భద్రత కోసం ఏర్పాటుచేసిన శక్తి యాప్ పై, విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టారు నెల్లూరు పోలీసులు.. ఏ ఒక్క మహిళ, నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా ముందుకు సాగాలనే ఆలోచనతో, మహిళల భద్రత కోసం రూపొందించిన “శక్తి యాప్”పై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు ఇతర ప్రజా ప్రదేశాల్లో మహిళలు, విద్యార్థినులకు యాప్ డౌన్‌లోడ్ విధానం, వినియోగంపై శక్తి బృందాలు అవగాహన కల్పిస్తున్నాయి. అదేవిధంగా బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, POCSO చట్టం మరియు మాదకద్రవ్యాల నిషేధంపై ప్రజలకు సూచనలు అందిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం 112, చిన్నారుల సహాయానికి 1098, సైబర్ మోసాల ఫిర్యాదులకు 1930 నంబర్లను వినియోగించాలని పోలీసులు సూచించారు.




