Nellore: “డ్రగ్స్ వద్దు బ్రో”.. యువతను చైతన్యపరుస్తున్న పోలీసులు!

Nellore: నెల్లూరు జిల్లాను నేరరహితంగా మార్చేందుకు పోలీస్ శాఖ సరికొత్త ప్రయోగం. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ఈగల్ క్లబ్స్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు.

V. Narasimhulu, Nellore
Published on: 19 Jun 2026 9:52 PM IST
Nellore
X

Nellore: “డ్రగ్స్ వద్దు బ్రో”.. యువతను చైతన్యపరుస్తున్న పోలీసులు!

Nellore: ఆసాంఘిక కార్యకలాపాలను అరికట్టే పనిలో భాగంగా.. నెల్లూరు జిల్లా పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో..

నెల్లూరు జిల్లాను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ గ్రామాలు, హైవేలు, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

“డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ఈగల్ క్లబ్స్ ద్వారా యువతలో చైతన్యం కల్పిస్తూ, డ్రోన్ల పర్యవేక్షణతో మాదకద్రవ్యాల నియంత్రణ చర్యలు చేపడుతోంది. సైబర్ నేరాలు, పోక్సో కేసులు, ఆర్థిక నేరాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

అసాంఘిక కార్యకలాపాల సమాచారం కోసం డయల్ 112 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు ఫిర్యాదు చేయవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా పోలీసులు తెలిపారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story