Marripadu: మర్రిపాడులో చికెన్ వ్యర్థాల వాహనం పట్టిలుతవేత

Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు వద్ద అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాల బోలెరో వాహనం సీజ్. కేసు నమోదు చేసిన ఎస్సై బలరాంరెడ్డి.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 21 July 2026 7:42 PM IST
Marripadu
X

Marripadu: మర్రిపాడులో చికెన్ వ్యర్థాల వాహనం పట్టిలుతవేత

మర్రిపాడు: నెల్లూరు జిల్లా అంతర జిల్లా సరిహద్దు ప్రాంతమైన మర్రిపాడు మండలంలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ ప్రత్యేక నిఘా తో నమ్మకమైన సమాచారం తో చికెన్ వ్యర్థాల వాహనం పట్టి కేసు నమోదు చేస్తున్నారు.

తెల్లవారుజామున నెల్లూరు ముంబై జాతీయరహదారి ఫై చుంచులూరు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న AP39 VD 4703 నెంబర్ చికెన్ వ్యర్థాల గల బోలెరో వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల సందర్భంగా వాహనంలో12 డ్రమ్ములలో చికెన్ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు.

ప్రజారోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉండటంతో, అధికారుల పర్యవేక్షణలో ఆ వ్యర్థాలను సమీప కొండ ప్రాంతంలో పూడ్చిపెట్టారు.అనంతరం అక్రమ రవాణాకు పాల్పడిన వాహనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

పర్యావరణానికి హాని కలిగించే విధంగా వ్యర్థాలను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై బలరాంరెడ్డి తెలిపారు గతంలో బ్రహ్మణపల్లి టోల్‌ప్లాజా వద్ద అనుమతులు లేకుండా చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకోవడం గమనార్హం

చికెన్ వ్యాపారులు, ప్రజలు ఎవరైనా ఇటువంటి అక్రమ నిల్వలు, వ్యర్థాల తరలింపులను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించి ప్రజారోగ్య సంరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్సై బలరాంరెడ్డి కోరారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story