Nellore: నెల్లూరు 72 డివిజన్లలో కూటమిదే విజయం బీద రవిచంద్ర!
Nellore: నెల్లూరు కార్పొరేషన్లోని 72 డివిజన్లలో కూటమి విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. 29 మంది అభ్యర్థులకు బీ-ఫారాలు పంపిణీ చేశారు.
Nellore: నెల్లూరు 72 డివిజన్లలో కూటమిదే విజయం బీద రవిచంద్ర!
నెల్లూరు: బీజేపీ,జనసేనలను కలుపుకొని నెల్లూరులోని 72 డివిజన్లలో విజయ దుందుభి మోగిస్తామని చెప్పారు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర. సిటీ నియోజకవర్గంలోని ఒక్కో డివిజన్ నుంచి నాలుగు పేర్లు అధిష్టానానికి పంపామని. పార్టీ పరిశీలించి 29 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసిందని చెప్పారు. అధిష్టానం ఆదేశాల మేరకు వాళ్ళందరికీ ఈరోజు బీఫామ్స్ పంపిణీ చేశామని చెప్పారు. నెల్లూరులో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి చేసిన అభివృద్ధి కూటమి అభ్యర్థుల విజయానికి దోహదపడుతుందని అన్నారు. మేయర్ గా రూప్ కుమార్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు బీద రవిచంద్ర. ఈ కార్యక్రమంలో కూటమి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్,
రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్,నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాల్గొన్నారు.




