Nellore: రైలు ప్రయాణికులకు పోలీసుల భద్రతా హెచ్చరికలు
Nellore: నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Nellore: రైలు ప్రయాణికులకు పోలీసుల భద్రతా హెచ్చరికలు
Nellore: నిన్న గుంటూరు జిల్లా పొన్నూరులో నేరస్తులపై జరిగిన పోలీస్ ఫైరింగ్ ఘటన నేపథ్యంలో, ఈ రోజు నెల్లూరు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్‌లలో ప్రయాణికుల భద్రత మరియు రైళ్లలో జరుగుతున్న నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ప్రయాణికులకు తమ సామాను మరియు విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని సూచించబడింది. అలాగే దొంగతనాలు, మాదక ద్రవ్యాల రవాణా మరియు రైలు ప్రయాణాల సమయంలో జరిగే ఇతర నేరాలపై కూడా అవగాహన కల్పించబడింది.
డి.ఎస్.ఆర్.పీ, నెల్లూరు వారి ఆధ్వర్యంలో ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో అధిక మొత్తంలో నగదు, బంగారం మరియు ఇతర విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, తమ ఆస్తుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించబడింది.
అదేవిధంగా, నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల సమ్మర్ డ్యూటీ నిమిత్తము కేటాయించిన 33 మంది పోలీస్ సిబ్బంది మరియు 1+4 ఆర్మ్డ్ ఫోర్స్ సిబ్బందితో కలిసి, బయటి ప్రాంతాల నుండి రైల్వే స్టేషన్ మరియు పరిసర ప్రాంతాలకు చొరబడే గ్యాంగులు, నేరస్తులు మరియు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిరోధించుటకు ఆర్‌పీఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకొని విస్తృత తనిఖీలు నిర్వహించబడినవి.
అలాగే, రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రయాణికుల భద్రత, రైళ్లలో జరుగుతున్న నేరాల నివారణ, దొంగతనాలు, మాదక ద్రవ్యాల రవాణా మరియు ఇతర నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండి, సురక్షితమైన ప్రయాణం కోసం రైల్వే పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.




