Nellore: కలిగిరిలో ఈదురు గాలుల బీభత్సం.. నేలమట్టమైన భారీ వృక్షాలు!
Nellore: నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో సోమవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.
Nellore: కలిగిరిలో ఈదురు గాలుల బీభత్సం.. నేలమట్టమైన భారీ వృక్షాలు!
నెల్లూరు జిల్లా: కలిగిరి మండలంలో సోమవారం తెల్లవారుజామున భారీ ఈదురు గాలులతో కూడిన స్వల్ప వర్షం కురిసింది.ఈ ప్రభావంతో కలిగిరి పట్టణంలోని పలుచోట్ల భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా కలిగిరి–కొండాపురం ప్రధాన రహదారిపై నాలుగైదు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు, తీగలు దెబ్బతిని కొన్ని స్తంభాలు కూలిపోయాయి.దీంతో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి శాఖ, విద్యుత్ శాఖ, పోలీసులు, పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లు, కొమ్మలను తొలగించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Next Story




