Nellore: రామాపురంలో చకచకా ఏర్పాట్లు: పరిశీలించిన మంత్రులు ఆనం, నారాయణ!

Nellore: రూ. 10 వేల కోట్ల కేంద్ర పథకానికి వేదిక కానున్న నెల్లూరు జిల్లా. ఉదయగిరి రామాపురంలో పల్లె పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఆనం, నారాయణ. సీఎం, డిప్యూటీ సీఎం రాక.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 21 Sept 2026 11:35 PM IST
Nellore
X

Nellore: రామాపురంలో చకచకా ఏర్పాట్లు: పరిశీలించిన మంత్రులు ఆనం, నారాయణ!

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో రూ.10 వేల కోట్ల కేంద్ర ప్రభుత్వ పథకానికి నెల్లూరు జిల్లా వేదిక కానుంది. ఉదయగిరి నియోజకవర్గంలోని రామాపురంలో ఈ నెల 29న నిర్వహించనున్న జీ రామ్ జీ – పల్లె పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

ఈ నేపథ్యంలో రామాపురంలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.రామాపురంలో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి,డాక్టర్ పొంగూరు నారాయణ, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెన వెంకట సత్యనారాయణ రాజు, ఎమ్మెల్సీ బీదారవిచంద్ర, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజితా వేజెండ్ల తదితరులు పరిశీలించారు.

హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్, సభా ప్రాంగణం, వీఐపీ రాకపోకలు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో మంత్రులు సమీక్షించారు. వివిధ శాఖలకు కేటాయించిన బాధ్యతలపై ఆరా తీశారు.

కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్, పార్కింగ్, విద్యుత్, వైద్య, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

కోకూరువారిపల్లిలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్న గోశాల వద్ద జరుగుతున్న పనులను కూడా మంత్రులు, అధికారులు పరిశీలించారు. ప్రారంభోత్సవానికి ముందే పనులను పూర్తి చేసి అవసరమైన అన్ని సౌకర్యాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, టీడీపీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. రామాపురం పరిసరాల్లో ఇప్పటికే ఏర్పాట్ల సందడి నెలకొంది.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE