Nellore: ఏటూరు వందన గెలుపే లక్ష్యంగా వైసీపీ శ్రేణుల ఇంటింటి ప్రచారం!

Nellore: నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ 7, 8వ వార్డుల్లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి ఏటూరు వందన గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Yellayya, Nellore
Published on: 26 Nov 2026 11:32 AM IST
Nellore
X

Nellore: ఏటూరు వందన గెలుపే లక్ష్యంగా వైసీపీ శ్రేణుల ఇంటింటి ప్రచారం!

నెల్లూరు: నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని 7, 8వ వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఏటూరు వందన గెలుపే లక్ష్యంగా వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, ఏటూరు వందనకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రచారంలో పాల్గొంటూ అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నారు.

7, 8వ వార్డుల్లో వైసీపీ శ్రేణుల ప్రచారంతో ఎన్నికల సందడి నెలకొంది. ఏటూరు వందన విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ MPTC సభ్యులుఏటూరు మురళీమోహన్ రెడ్డి, ఆంజనేయపురం రాజు, డమాయి రమణయ్య, గౌస్ పీర్ తదితరులు పాల్గొన్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore