Nellore: ఎంపీటీసీ అభ్యర్థి సుమతిని గెలిపించండి: రేవంత్ చక్రవర్తి!

Nellore: నెల్లూరు జిల్లా రాపూరు బిట్‌-2 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి మేరీగా సుమతికి మద్దతుగా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు డాక్టర్ రేవంత్ చక్రవర్తి ప్రచారం చేశారు.

Yellayya, Nellore
Published on: 29 Oct 2026 6:35 PM IST
Nellore
X

Nellore: ఎంపీటీసీ అభ్యర్థి సుమతిని గెలిపించండి: రేవంత్ చక్రవర్తి!

నెల్లూరు: నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. రాపూరు బిట్‌-2 వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మేరీగా సుమతికి మద్దతుగా నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు డాక్టర్ మేరుగా రేవంత్ చక్రవర్తి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు.

ప్రచారంలో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకుని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డాక్టర్ రేవంత్ చక్రవర్తి సూచించారు. స్థానిక ప్రాంతాల్లో పర్యటిస్తూ డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదని పేర్కొంటూ, ప్రజలు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించి ఆలోచనాత్మకంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

రాపూరు బిట్‌-2లో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మేరీగా సుమతిని గెలిపించడం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఆయన కోరారు. ప్రజల మద్దతుతో పార్టీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నాగ ప్రకాష్ రెడ్డి, డాక్టర్ ఖాదర్ బాషా, డమాయి, పార్టీ మండల కార్యదర్శి దాసరి వెంకటరమణయ్య, మాతంగి మోషే, దాసరి మోషే, దాసరి సైలేష్ బాబు, మేరీగా సతీష్, మేరీగా నితీష్, దమాయి కన్నప్ప తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore