Nellore: టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నేత శశిధర్ రెడ్డి!

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరులో వైసీపీకి షాక్ తగిలింది. సీనియర్ నేత శ్రీకి రెడ్డి శశిధర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

Yellayya, Nellore
Published on: 26 Oct 2026 11:27 PM IST
Nellore
X

Nellore: టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నేత శశిధర్ రెడ్డి!

నెల్లూరు: నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాపూరుకు చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు శ్రీకి రెడ్డి శశిధర్ రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తానంచర్లలోని చెన్ను గార్డెన్స్‌లో నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు.

వైసీపీకి భవిష్యత్తు లేదనే అభిప్రాయంతోనే పలువురు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాపూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీనియర్ నాయకుల పార్టీ మార్పులు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.

ఇప్పటికే ఎన్నికల బరిలో తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుల చేరిక మరింత బలాన్ని చేకూర్చే అవకాశముంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాపూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ సాధించాలనే లక్ష్యంతో టీడీపీ ముందుకు సాగుతున్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

మొత్తానికి రాపూరు మండల రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

Yellayya, Nellore

Yellayya, Nellore