Marripadu: మర్రిపాడు అడవుల్లో అరుదైన అడవి దున్నపోతు ప్రత్యక్షం

Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు అడవుల్లో అరుదైన బాహుబలి అడవి దున్నపోతు సందడి. వేటగాళ్ల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్న జంతు ప్రేమికులు, అటవీ అధికారులు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 15 July 2026 9:40 PM IST
Marripadu
X

Marripadu: మర్రిపాడు అడవుల్లో అరుదైన అడవి దున్నపోతు ప్రత్యక్షం

మర్రిపాడు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో కాబోలు, బ్రాహ్మణపల్లి పరిసర అటవీ ప్రాంతాలలో అడవి దున్నపోతు గ్రామస్తులను అబ్బురపరిచింది.నల్లమల అటవీ ప్రాంతానికి అనుకొని ఉన్న నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన మర్రిపాడు మండల పరిధిలోని అడవుల్లో అరుదైన అడవి దున్నపోతు (బాహుబలి దున్నపోతు )కనిపించింది.

అటవీ అధికారులు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ అరుదైన అతిథి అడవి దున్న చాలా ఏళ్లకు కనిపించడంతో అటవీశాఖ అధికారులు వేటగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు చేపట్టాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. మహారాష్ట్ర అడవుల నుంచి నల్లమల అడవులకు అక్కడనుంచి సింహాచలం శేషగిరి కొండల వరకు విస్తరించిన క్రమంలో మర్రిపాడు మండలం వెంకటాపురం అడవి జంతువుల అవాసానికి వలస వెళ్ళడానికి ఘాటు ఏర్పాటు ఉంటుందని మండలంలో కొందరు పెద్ద వయస్సు కలిగిన వారు చెప్పుకోవడం విశేషం.

అడవి దున్నలకు దట్టమైన అభయారణ్యంలో స్వేచ్చగా తిరుగుతూ అప్పుడప్పుడు పర్యాటకులను, అటవి సమీప గ్రామాల ప్రజలకు తారసపడుతుంటాయి. కాని ఈ సారి మాత్రం బాహుబలి దున్నలుగా పిలిచే కవ్వాల్ అడవి దున్నలు కనిపించడంతో ఈ దృశ్యాలను మండల వాసులు తమ సెల్ ఫోన్లలలో రికార్డ్ చేశారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story