Varikuntapadu: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
Varikuntapadu: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం వద్ద NH 565పై రోడ్డు ప్రమాదం. ఒమ్నీ, బొలెరో వాహనాలు ఢీకొని ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు.
Varikuntapadu: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
వరికుంటపాడు: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం వద్ద జాతీయ రహదారి 565పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామాపురం సమీపంలో ఓమిని వ్యాన్‌ను బొలెరో వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను వాహనాల నుంచి బయటకు తీసి, చికిత్స నిమిత్తం పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
జాతీయ రహదారి 565పై ప్రమాదం జరగడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు, క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




