Nellore: రొట్టెల పండుగలో ఆయుష్ శాఖ ప్రత్యేక వైద్య సేవలు

Nellore: నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగకు వచ్చే భక్తుల కోసం జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద, హోమియో, యునాని వైద్య సేవలు అందిస్తున్నారు.

V. Narasimhulu, Nellore
Published on: 29 Jun 2026 8:23 PM IST
Nellore
X

Nellore: రొట్టెల పండుగలో ఆయుష్ శాఖ ప్రత్యేక వైద్య సేవలు

Nellore: నెల్లూరు జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరం, బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేస్తున్న భక్తులకు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది. రొట్టెల పండుగ సందర్భంగా ఆయుష్, యునాని, హోమియోపతి వైద్య సేవలను ప్రత్యేక స్టాల్ ద్వారా అందిస్తున్నారు.

ఈ నెల 26వ తేదీన రొట్టెల పండుగ ప్రారంభమైనప్పటి నుంచి, ప్రతిరోజూ సుమారు వెయ్యి మందికి పైగా భక్తులకు ఉచితంగా వైద్య సేవలు, మందులు అందజేస్తున్నారు.

సుదూర ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు కడుపునొప్పి, అజీర్తి, జ్వరం, ఒళ్లు నొప్పులు, తల తిరగడం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు తక్షణ చికిత్స అందించి ఉపశమనం కలిగిస్తున్నారు.

ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో డాక్టర్లు సరళ హెబ్సిబా, ముదిగొండ శ్రీనివాసరాజు, జ్ఞాన ప్రసూన, వినోద్ బాబు, సుధారాణి, జాకీరుద్దీన్, హరిత, అబ్దుల్ రజాక్ తదితరులు సేవలందిస్తూ భక్తుల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నారు.

రొట్టెల పండుగ ముగిసే వరకు ఈ వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగనున్నట్లు జిల్లా ఆయుష్ శాఖ అధికారులు తెలిపారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story