Nellore: రొట్టెల పండుగ ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి!

Nellore: నెల్లూరు బారా షహీద్ దర్గాలో ఐదు రోజుల పాటు జరిగిన చారిత్రాత్మక రొట్టెల పండుగ ముగింపు వేడుకల్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore
Published on: 1 July 2026 7:52 AM IST
Nellore
X

Nellore: రొట్టెల పండుగ ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి!

Nellore: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రొట్టెల పండుగ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు శాసనసభ్యురాలు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు.

అద్భుత ఏర్పాట్లు చేసిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి & జిల్లా యంత్రాంగానికి అభినందనలు. నెల్లూరు బారా షహీద్‌ దర్గాల ఐదు రోజుల రొట్టెల పండుగ మంగళవారం ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

నెల్లూరు జిల్లాలో ఉన్న బారా షహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ ఎంతో పవిత్రమైన పండుగని కొనియాడారు. ఈ పండుగకు దేశ, విదేశాల నుంచి, అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని చెప్పారు. భక్తులు తమ కోరికలు నెరవేరితే, లేదా ఏవైనా కోరికలు ఉంటే ఇక్కడ రొట్టెలు వదలడం,

పట్టుకోవడం చేస్తుంటారని తెలిపారు. ఈ సంప్రదాయంపై ఉన్న బలమైన నమ్మకం వల్లే ఏటా లక్షల మంది భక్తులు ఈ పండుగకు వస్తున్నారని, తాను కూడా గత 20 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు పొందుతున్నానని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గుర్తుచేసుకున్నారు.

పండుగకు భారీగా తరలివచ్చే భక్తులకు ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, రూరల్‌ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి, జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్లా, వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ అజీజ్‌ , జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, కోటం రెడ్డి గిరిధర్‌ రెడ్డి , అలాగే జిల్లా యంత్రాంగం, దర్గా కమిటీ సభ్యులు, సేవలు అందించిన అందరికీ ఆమె తన ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. ఏటా ఈ పండుగను ఇంకా ఘనంగా జరపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ అల్లా ఆశీస్సులు ఉండాలని, అందరి కుటుంబాలకు మంచి జరగాలని ఆమె ఆకాంక్షించారు.

రొట్టెల పండుగ చివరి రోజున రాష్ట్రం, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ , మంత్రి, యువ నాయకులు నారా లోకేష్‌ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ అజీజ్‌ తో కలిసి తాను రొట్టెలు మార్చుకున్నట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story