Nellore: గుండెపోటుతో తెలుగు పండిట్ ప్రశాంత్ మృతి

Nellore: నెల్లూరు నగరంలోని ఆర్‌ఎస్‌ఆర్ నగరపాలకోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ప్రశాంత్ సోమవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు.

V. Narasimhulu, Nellore
Published on: 15 Jun 2026 6:31 PM IST
Nellore
X

Nellore: గుండెపోటుతో తెలుగు పండిట్ ప్రశాంత్ మృతి

Nellore: నెల్లూరు నగరం లోని RSR నగర పాలకోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ప్రశాంత్ గుండెపోటుతో మృతిచెందారు. ఈ రోజు ఉదయం పాఠశాలకు హాజరైన ఆయన అందరితో కలివిడిగా మాట్లాడ్డం.. విద్యార్థులకు పుస్తకాలు ఇప్పించడం.. మధ్యహాన్న భోజనంపై ఆరా తీశారు.

కొద్దిసేపటికే ఛాతీలో నొప్పి రావడంతో మరో ఇద్దరు ఉపాధ్యాయులతో కలసి రామచంద్రారెడ్డి హస్పెటల్ కు వెళ్లారు. అక్కడ స్ట్రోక్ అని చెప్పి.. మెడికవర్ హస్పెటల్ కు వెళ్లాలని సూచించారు. అంబులెన్స్ లో వెళ్తుండగా మార్గం మధ్యలో ప్రశాంత్ అయ్యవారు కన్ను మూశారు.

ప్రశాంత్ సర్.. ఈ ఏడాది డిసెంబర్ లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన మృతితో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు విషాదంలో మునిగిపోయారు. ప్రశాంత్ టీచర్ కు వివాహం కాలేదు. ఆయన ఉపాధ్యాయ వృత్తిలోనే సంతోషం చూసుకున్నారు. గతంలో ఆయన ఎక్కువ కాలం.. వెంకటేశ్వరపురం లోని నగరపాలకోన్నత పాఠశాలలో పని చేసారు. మంచి పేరు తెచ్చుకున్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story