Nellore: నెల్లూరు ఆర్టీసీ డిపోలో హర్రర్.. ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బస్సు!

Nellore: నెల్లూరు ఆర్టీసీ మెయిన్ డిపోలో సోమశిల బస్సు అదుపుతప్పి ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

V. Narasimhulu, Nellore
Published on: 25 Jun 2026 5:12 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు ఆర్టీసీ డిపోలో హర్రర్.. ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బస్సు!

నెల్లూరు: ఆర్టీసీ మెయిన్ డిపోలో ఓ బస్సు హర్రర్ సృష్టించింది... ప్లాట్ ఫామ్ పై వేచి ఉన్న ప్రయాణికుల పైకి దూసుకెళ్లింది. సోమశిల- నెల్లూరు మధ్య తిరుగుతున్న ఆర్టీసీ బస్సు డిపోలో ఆగే క్రమంలో.. ప్లాట్ ఫామ్ లోపలికి దూసుకెళ్లింది.

ఈ ఘటన లో ఫ్లాట్ ఫాం పై వేచి ఉన్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆర్టీసీ అంబులెన్స్ ద్వారా, జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు...ప్రమాదం లో బస్సు ముందు భాగంతో పాటు ప్లాట్ ఫామ్ దెబ్బతిన్నది. అతివేగం లో అదుపుతప్పి బస్సు ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లినట్లు స్థానికులు చెప్తున్నారు..

ప్రమాదంతో డిపోలో కాసేపు గందరగోళం ఏర్పడింది.. ప్రయాణికులు హాహాకారాలు చేశారు..హ ప్లాట్ ఫారం పై, వేచి ఉన్న అనేక మంది ప్రయాణికులు పరుగులు తీశారు..దీంతో ఆర్టీసీ మెయిన్ డిపోలో కాసేపు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి..

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story