Nellore: గూడూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం
Nellore: నెల్లూరు జిల్లా గూడూరు బస్టాండ్‌లో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
Nellore: గూడూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం
Nellore: ఈరోజు నెల్లూరు జిల్లా, గూడూరు ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ డ్రైవర్లు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, యూనియన్ సభ్యులు,స్థానిక ప్రయాణికులు,పేద ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది. అన్ని రకాల వైద్య పరీక్షలకు సంబంధించిన డాక్టర్లు, ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందించడం చేశారు.
సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆర్టీసీ చైర్మన్ గా ఎన్నికైన తరువాత నుంచి, ఆర్టీసీ బస్టాండులలో ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో రకాల కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ఎప్పుడు లేని విధంగా ఆర్టీసీ బస్టాండుల నిర్వహణలో కొత్త కొత్త మార్పులు చేపట్టి, ఆర్టీసీ విభాగంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నందుకు సురేష్ రెడ్డిపై ఆర్టీసీ సిబ్బంది అందరూ ప్రశంసలు కురిపించారు.
ఈ కార్యక్రమంలో గూడూరు టౌన్ బిజెపి అధ్యక్షుడు దయాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు, మహిళా మోర్చ నాయకురాలు బిందు రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చ గాలి ప్రకాష్ నాయుడు, టౌన్ మాజీ అధ్యక్షులు చెంచు రెడ్డి, బిజెపి టౌన్ కమిటీ సభ్యులు కటికాల సురేష్, ఐ సురేష్ బాబు, గుమ్మడి శ్రీనివాసులు, శివ... తదితరులు పాల్గొన్నారు.




