Nellore: 30వ డివిజన్‌లో పట్టు బిగిస్తున్న నూనె రుషి యాదవ్!
Nellore: నెల్లూరు రూరల్ 30వ డివిజన్ జనసేన అభ్యర్థి మల్లికార్జున యాదవ్ తరఫున ఆయన తనయుడు రుషి యాదవ్ ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేశారు.
Nellore: 30వ డివిజన్‌లో పట్టు బిగిస్తున్న నూనె రుషి యాదవ్!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 30 డివిజన్లో జనసేన అభ్యర్థి నూనె మల్లికార్జున యాదవ్ తనయుడు నూనె రుషి యాదవ్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ డివిజన్లో వైసీపీ నుంచి ఖాదర్ బాషా జనసేన అభ్యర్థికి పోటీ ఇస్తుండగా.. క్రమంగా నూనె రుషి జనంతో మమేకమవుతున్నారు.
ప్రతి ఇంటికి వెళ్లి కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యాదవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గంపగుత్తగా ఓట్లు వేయించుకునే ప్రయత్నంలో భాగంగా ముఖ్య నేతలను కలుస్తున్నారు. 30 డివిజన్లో క్రమంగా జనసేన అభ్యర్థి పట్టు బిగిస్తున్నారు.




