Nellore: నెల్లూరు రూరల్‌లో నూతన 8.0 MVA ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం
Nellore: నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరులో రూ.1.46 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 8.0 MVA ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించిన అధికారులు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
Nellore: నెల్లూరు రూరల్‌లో నూతన 8.0 MVA ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్, కొత్తూరు (కావేరి నగర్) విద్యుత్ సబ్ స్టేషన్ నందు 1కోటి 46 లక్షల రూపాయల వ్యయంతో 8.0 MVA ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు నెల్లూరు రూరల్ విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఆపరేషన్స్) ఎల్.ప్రసాద్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ...
గతంలో ఈ ప్రాంతానికి ప్రజాబాటలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చినప్పుడు, ఈ ప్రాంతంలో లో-వోల్టేజ్ సమస్య ఉందని, స్థానిక ప్రజలందరూ చెప్పినప్పుడు వెంటనే స్పందించి దానిమీద ఎస్.ఇ. కి ఫోన్ చేసి ప్రత్యేకంగా మాట్లాడారని గుర్తు చేశారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 18 గ్రామాలు, 26 డివిజన్ లలో ఏ సమస్య ఉందని చెప్పినా దానిని పూర్తిచేయడమే లక్ష్యంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే కార్యాలయం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ నూతన 8.0 MVA ట్రాన్స్ఫార్మర్ వలన 30వ మరియు 31 వ డివిజన్ ల పరిధిలోని ప్రాంతాలలో 16 వేల మంది వినియోగదారులకు కరెంటు అంతరాయం లేకుండా నాణ్యమైన కరెంటు అందుతుందని చెప్పారు.
ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే, ఆ సమస్య పరిష్కరించడమే తమ బాధ్యత అని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని, ఏ సమస్య ఉన్నా తెలియజేయండి అంటూ పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మన్నేపల్లి రఘు, కో క్లస్టర్ ఇంచార్జ్ పల్నాటి మస్తాన్ నాయుడు, 30వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు అత్తివరపు యానదయ్య, 31వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కూకటి హరిబాబు యాదవ్, టీడీపీ నాయకులు ఓబుల్ రాజు, ఖాదర్ భాష, కొప్పాల సురేష్, జమీర్, టీ.వి.ఎస్. కమల్, విగ్నేశ్వర రావు, శ్రీనివాసల రెడ్డి, వేణు, రాజేష్, విజయ్ రెడ్డి,
రాకేష్, అశోక్, షాహూల్, హఫీజ్, నజీర్, బద్దెపూడి కృష్ణ, వెంకీ, శివారెడ్డి, అనిల్, దుర్గాప్రసాద్, కృష్ణ, రాజు, నరసింహారావు, కిష్టయ్య, శేషయ్య, రాజశేఖర్ రెడ్డి, వేలు రాము, పద్మనాభ రెడ్డి, పెంచలయ్య, పద్మాయ్య, గోపాలకృష్ణ, చక్రపాణి, భద్రయ్య, అల్తాఫ్, చంద్రబాబు, రాము, మల్లి బాబు, మోహన్ రావు, వెంకటలక్ష్మి, ప్రభావతి, దొరసానమ్మ, దేవసేనమ్మ, మొబీనా, పలాల సునీత జనసేన నాయకులు కరీమ్ మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




