Nellore: నెల్లూరు రూరల్‌లో రూ.3.25 కోట్లతో సీసీ డ్రైన్ పనులు
Nellore: నెల్లూరు రూరల్ 33వ డివిజన్‌లో రూ.3.25 కోట్లతో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
Nellore: నెల్లూరు రూరల్‌లో రూ.3.25 కోట్లతో సీసీ డ్రైన్ పనులు
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 33వ డివిజన్ వెంగల్ రావు నగర్, ఎ-బ్లాక్ నందు 3కోటి 25లక్షల రూపాయలతో సి.సి. డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు స్థానిక ప్రజలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 33వ డివిజన్ అభివృద్ధికి 7 కోట్ల 25 లక్షల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు గిరిధర్ రెడ్డి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ లో 857 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుందని చెప్పారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ప్రజల అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మన్నెం పెంచల్ నాయుడు, 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కరణం హజరత్ నాయుడు, బీజేపీ నాయకులు ఈశ్వరయ్య, జనసేన నాయకులు లాలూ మస్తాన్, టీడీపీ నాయకులు తుమ్మల శ్రీనివాసులు నాయుడు, జయ శంకర్, శ్రీధర్ బాబు, కటారి వెంకట రమణయ్య, రమణయ్య నాయుడు, నాని, ఆనంద్, అశోక్, వెంకటేష్, భాష, రత్నం, దయాకర్, పసుపులేటి కళ్యాణి, ప్రసాద్, సుబ్బారాయుడు, రాజేష్ చౌదరి, మురఘ, షఫీ, పవన్, ఈశ్వరయ్య , షఫీ బాబు, మస్తానయ్య, మజీద్, నరసింహులు, పవన్, అరవ సుబ్రమణ్యం, శ్రీనివాసులు, బాబు చౌదరి, నాగేశ్వరరావు, వాసు, షరీఫ్, రసూల్ , బాలకృష్ణ, కాలేషా మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొనారు.




