Nellore: నెల్లూరులో పోలీసుల మెరుపు సోదాలు: దీన్ దయాల్ నగర్‌లో కార్డన్ & సెర్చ్.. 17 బైక్‌లు స్వాధీనం!
Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు దీన్ దయాల్ నగర్‌లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
Nellore: నెల్లూరులో పోలీసుల మెరుపు సోదాలు: దీన్ దయాల్ నగర్‌లో కార్డన్ & సెర్చ్.. 17 బైక్‌లు స్వాధీనం!
నెల్లూరు: జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, గార్డెన్ సెర్చ్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దీన్ దయాల్ నగర్ ప్రాంతంలో విస్తృత కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీలలో పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
ప్రజలకు ట్రాఫిక్ నియమాలు, మహిళల భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ అనుమానాస్పద సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలంటే ప్రజల సహాయ సహకారాలు కూడా పోలీసు వారికి అవసరమని, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, అనుమానాస్పద రీతుల్లో ఏ సంఘటన గాని, ఏ వ్యక్తులు గాని కనిపించినప్పుడు పోలీసు వారికి సమాచారం అందించాలని పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.




