Nellore: రూ.1.50 కోట్లతో సీసీ రోడ్ల శంకుస్థాపన కోటంరెడ్డి

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.1.50 కోట్లతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో రూరల్‌లో భారీ అభివృద్ధి జరుగుతోందని గిరిధర్ రెడ్డి తెలిపారు.

V. Narasimhulu, Nellore
Published on: 9 Oct 2026 4:12 PM IST
Nellore
X

Nellore: రూ.1.50 కోట్లతో సీసీ రోడ్ల శంకుస్థాపన కోటంరెడ్డి

నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పల్లెపండుగ 3.0 నిధులతో పెనుబర్తి, మాదరాజు గూడూరు, కాకుపల్లి గ్రామాలలో 1 కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో సీ.సీ. రోడ్లకు శంకుస్థాపన చేశారు నెల్లూరు ఏఎంసీ ఛైర్మెన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

నెలరోజుల్లో ఈ అభివృద్ధి పనులను పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 970 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారని చెప్పారు..

కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న 18 గ్రామాల అభివృద్ధికి 134 కోట్ల రూపాయలను కేటాయించామని చెప్పారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్ లో 100 కి 100 శాతం గెలిపించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గౌరవాన్ని పెంచాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore