Nellore: నెల్లూరు రూరల్ శరవేగంగా పొట్టేపాలెం బ్రిడ్జి నిర్మాణం
Nellore: నెల్లూరు రూరల్‌లో రూ.5.60 కోట్లతో పొట్టేపాలెం బ్రిడ్జి నిర్మాణం. పనులను పరిశీలించిన టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఆగస్టు సెప్టెంబర్‌లో ప్రారంభం.
Nellore: నెల్లూరు రూరల్ శరవేగంగా పొట్టేపాలెం బ్రిడ్జి నిర్మాణం
నెల్లూరు: చరిత్రలో నిలిచిపోయేలా నెల్లూరు రూరల్ ను అభివృద్ధి చేస్తున్నామని, నెల్లూరు రూరల్ అభివృద్దే మా ప్రధాన లక్ష్యం అని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో 5 కోట్ల 60 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులను పరిశీలించిన అనంతరం
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ....
గత ప్రభుత్వంలో పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి కోసం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేసినా అవి సంతకాలకే పరిమితం అయ్యాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరియు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖామంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి సహాయ సహకారాలతో 5 కోట్ల 60 లక్షల రూపాయలతో పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులను మంజూరు అయ్యాయని,ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. పది కాలాలపాటు ప్రజలకు మేలుచేసేలా ఉండాలని పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామని,
ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలోగా పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి ని ప్రారంభిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధిపధంలో నిలుపుతున్నారని చెప్పారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంచార్జ్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ గ్రీవెన్స్ సెల్ ఇంచార్జ్ మంగళాపూడి భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉలవపాటి.
ఏడుకొండలు, ఎంపీటీసీ నేరెళ్ల. నారాయణ, మాజీ సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి, టీడీపీ నాయకులు కందల. హరి, పొన్నాల. రామచంద్రరెడ్డి, నేరెళ్ల బాలకృష్ణ, సురేష్, ముత్యాల సుబ్రహ్మణ్యం, నరసయ్య, రియాజ్, సురేష్ రెడ్డి, అశోక్ రెడ్డి, నావాజ్, పెంచలయ్య,వెంకటరమణ య్య అశోక్, గోపి, శ్రీనాథ్, బాబు, శ్రీనయ్య, నరసయ్య, నరసింహ ఆచారి, రామయ్య, మల్లయ్య, వెంకటేశ్వర్లు, మహేష్, వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య, జయచంద్ర, అనిల్, అలియాస్, షఫీ, హర్ష, రఘు, శ్రీనయ్య తదితరులు పాల్గొన్నారు.




