Nellore: నెల్లూరు రూరల్ అభివృద్ధి వేగవంతం రూ.41 లక్షల పనులకు శ్రీకారం!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్‌లో రూ.41 లక్షలతో సి.సి. రోడ్డు, డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో రూ.857 కోట్లతో అభివృద్ధి పనులు.
Nellore: నెల్లూరు రూరల్ అభివృద్ధి వేగవంతం రూ.41 లక్షల పనులకు శ్రీకారం!
Nellore: నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 24వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ నందు 41 లక్షల రూపాయలతో సి.సి. రోడ్డు మరియు సి.సి. డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు స్థానిక ప్రజలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 24వ డివిజన్ అభివృద్ధికి 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ లో 857 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుందని చెప్పారు.
ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఎస్.సి. సెల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు, కో క్లస్టర్ ఇంచార్జ్ రాఘవేంద్ర రావు, 24వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు రవి, టీడీపీ నాయకులు సలీమ్, శ్రీ కొలను శ్రీనివాసులు రెడ్డి, విజయసేనా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కోటేశ్వరరావు, సులమ్, భాస్కర్ రావు, మస్తానయ్య, అశోక్ రెడ్డి, హరికృష్ణ యాదవ్, భీమతాటి సుధాకర్, భాస్కర్ నాయుడు, చిట్టిబాబు, శేషు, జగన్, చల్లా వెంకటేశ్వర్లు, రేవూరి ప్రతాప్, ఇబ్రహీం, చల్లా వెంకటేశ్వర్లు, మనోహర్ రెడ్డి, యాదగిరి, సుధా, శ్రీనాథ్, సాయి, సాయి ప్రసాద్, ముద్దుకృష్ణా రెడ్డి, హరిహర రెడ్డి, రాము, వెంకటసుబ్బయ్య, ఇందిరమ్మ, సులోచన, పరిమళ మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొనారు.




