Nellore: నెల్లూరు రూరల్‌లో నూతన బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
Nellore: నెల్లూరు రూరల్ ములుమూడిలో రూ.83 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు.
Nellore: నెల్లూరు రూరల్‌లో నూతన బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు: చరిత్ర సృష్టించే అభివృద్ది నెల్లూరు రూరల్ లో జరుగుతుందని చెప్పారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గత 10 సంవత్సరాలలో చేయలేనివి ఈ రెండేళ్లలో చేసి చూపించానని చెప్పారు.
నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ములుమూడి గ్రామంలో 83 లక్షల రూపాయలతో నిర్మించిన ములుమూడి కలుజుపై బ్రిడ్జిని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి...
చెప్పిన మాట ప్రకారం 6 నెలల్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కలుజు మీద బ్రిడ్జి పూర్తిచేసి చూపించారని చెప్పారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. తన దృష్టికి ఏ సమస్య వచ్చినా తన వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని జిల్లా కలెక్టర్ అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,జిల్లా కలెక్టర్ సహకారంతో ములుమూడి కలుజు మీద బ్రిడ్జి పూర్తిచేశామని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. మరో 2నెలల్లో పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు




